ములుకుదురులో అంబటి సుడిగాలి పర్యటన

ములుకుదురులో అంబటి సుడిగాలి పర్యటన

గుంటూరు: పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. సిద్ధం పాంప్లెట్లను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.