నేటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ
MBNR: MBNR జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నవంబర్ నెల మొత్తం పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి. జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లో నిర్వహించరాదని ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులను ఆమె సూచించారు. భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.