ఈనెల 30న మోరంపల్లిబంజర సంత వేలంపాట
BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో వారాంతపు సంత నిర్వహణ కోసం ఈ నెల 30న (సోమవారం) ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. పెసా చట్టం ప్రకారం కేవలం ఎస్టీ (ST) సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే రూ.1 లక్ష డిపాజిట్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనాలని సర్పంచ్ బొర్రా సుభద్ర తెలిపారు.