అదుపు తప్పి టిప్పర్ బోల్తా
SRD: చౌటకూర్ మండల పరిధిలోని సర్వేపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి ఫ్లైఓవర్ నుంచి సర్వీస్ రోడ్డుకు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.