'స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి'

'స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి'

AKP: స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలని కోటవురట్ల మండలం ఎంపీడీవో ‌ చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం గొట్టి వాడలో జరుగుతున్న స్వామిత్వ‌‌‌ సర్వేను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. సర్వే పూర్తి అయిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి ఇళ్లు ,ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కు పత్రాలను సంబంధిత యజమానులకు జారీ చేయడం జరుగుతుందన్నారు.