కొత్తగా స్క్రబ్ టైపస్ కేసులు నమోదు
CTR: జిల్లాలో గత రెండు రోజుల వ్యవధిలోనే కొత్తగా 9 స్క్రబ్ టైపస్ కేసులు నమోదయ్యాయి. పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, సోమల, సదుం, కార్వేటినగరం మండలాల్లో కేసులు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. వీరిలో కొంత మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు తిరుపతి, తమిళనాడు, వేలూరులోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.