350 విమాన సర్వీసులు రద్దు

350 విమాన సర్వీసులు రద్దు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల గగనతల ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రభావంతో భారత్‌లో ఇవాళ మొత్తం 350 దేశీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికులు తమ విమాన స్థితిగతులను ఎయిర్‌లైన్స్ ద్వారా సరిచూసుకోవాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు అవసరమైన సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.