'బీసీల రాజ్యాధికారమే లక్ష్యం'

'బీసీల రాజ్యాధికారమే లక్ష్యం'

BHNG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ)ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కేంద్రంలో టీఆర్‌పీ జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.