వేంపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

వేంపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కడప జిల్లా వేంపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక గుర్రప్ప తోటలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతిడి వివరాలు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.