సాయి, కుల్‌దీప్‌ను ఎంపిక చేయాలి: MSK ప్రసాద్

జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే భారత జట్టుకు సాయి సుదర్శన్, కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేయాలని సూచించాడు. అలాగే, ఇంగ్లిష్ పరిస్థితుల్లో అర్ష్‌దీప్ సింగ్ బాగా పనికొస్తాడని వెల్లడించాడు.