చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
MHBD: నెల్లికుదురు మండలం బోటిమీది తండాకు చెందిన కొర్ర రాజు (55) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనెల 19న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి బంధువు కొర్ర దేవా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.