VIDEO: వాహన తనిఖీల్లో వెండి ఆభరణాలు స్వాధీనం

VIDEO: వాహన తనిఖీల్లో వెండి ఆభరణాలు స్వాధీనం

NRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట పట్టణ శివారులో బుధవారం పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. కాగా, 7 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శివశంకర్ వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన ప్రసాద్, కర్ణాటక యాదగిరి నుంచి హైదరాబాద్‌కు వెండి తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. ఆభరణాలకు సంబంధించిన రసీదులు లేకపోవడంతో వాటిని గ్రీవెన్స్ కమిటీకి అప్పగించారు.