'మూడు నెలల నుంచి జీతాలు పడలేదు'
NLR: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని 12 సచివాలయంలోని సిబ్బందికి సుమారు మూడు నెలలు జీతాలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఈ నెలైనా జీతాలు వస్తాయా లేదా అని ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.