ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

PDPL: మంథని మండలం ఆరెంద గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆరేపల్లి సాంబయ్య అనే రైతుకు చెందిన గడ్డి వాము దగ్ధమైంది. పొలంలో గడ్డివాము నిల్వ చేయగా మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.