విద్యార్థుల ఫొటోల మార్ఫింగ్ కలకలం
శ్రీకాకుళంలోని ఓ కాలేజీలో ఫోటోల మార్ఫింగ్ ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. బాధితురాలు తల్లిదండ్రుల ద్వారా విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపింది. దీంతో నిందితుడుతోపాటు మరో నలుగురికి కాలేజ్ మాజమాన్యం TCలు ఇచ్చింది. దీనిపై కాలేజీలో విద్యార్థినులు ఆందోళన చేయడంతో రూరల్ PSలో కేసు నమోదు చేశారు.