గుడివాడ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ఎమ్మెల్యే రాము సీఎం చంద్రబాబుకు ఈరోజు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మశాన వాటికలో కోసం పట్టణంలో 10 ఎకరాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 35 ఎకరాలు సేకరించాలన్నారు. బస్టాండ్ నుంచి నాగవరప్పాడు వరకు రోడ్డు అభివృద్ధికి రూ.17.95 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు.