ఒకే వేబిల్లుపై కొన్ని నెలలుగా ఇసుక అక్రమ రవాణా
NZB: పోతాంగల్ మండలంలోని మంజీరా నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలిసింది. ఒకే వేబిల్లుపై నెలల తరబడి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఒకే వేబిల్లును ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత తహసీల్దార్ పట్టించుకోకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.