బత్తలపల్లిలో కేతిరెడ్డి భారీ రోడ్ షో

సత్యసాయి: బత్తలపల్లి మండల కేంద్రంలో గురువారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. ధర్మవరం రోడ్డు నుండి తాడపత్రి రోడ్డు శివాలయం వరకు బారీ రోడ్ షో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులతో నాలుగు రోడ్ల కూడలి కిక్కేసిపోయింది. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలన్నారు.