రైలు కిందపడి వృద్ధురాలి మృతి

NLR: కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామానికి చెందిన ఎక్కటిల్లి లక్షమ్మ(80) మంగళవారం సింగరాయకొండలో రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ కింద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి రైల్వే పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.