బాధితుడికి ఫోన్ అందజేసిన ఎస్సై

BHPL: చిట్యాల మండలం నైన్‌పాక గ్రామానికి చెందిన ఉడుత మోహన్ ఐదు నెలల క్రితం తన ఫోన్‌ను పోగొట్టుకొని చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఆదేశాలతో కానిస్టేబుల్ లాల్ సింగ్ CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను హైదరాబాద్‌లో గుర్తించారు. ఆదివారం ఎస్సై శ్రావణ్ కుమార్ బాధితుడికి ఫోన్‌ను అందజేశారు.