బాలికల భద్రతపై పోలీసుల అవగాహన
TPT: గూడూరు రోటరీ భవనంలో మహిళలు, బాలికల భద్రతపై ఒకటో పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 'శక్తి యాప్', డీజీపీ ప్రవేశపెట్టిన 'ఆపరేషన్ చిన్నారి తల్లి' గురించి వివరించారు. దేశాభివృద్ధికి మహిళలు, బాలికల రక్షణ ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు.