'తేమ శాతం తక్కువ ఉండేలా చూడాలి'
MNCL: వరి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జన్నారం మండలంలోని దేవునిగూడెం క్లస్టర్ ఏఈవో అక్రమ్ అన్నారు. మంగళవారం దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామ శివారులో ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో మంచి ఎక్కువగా పడుతుందని, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంపై కవర్లను తప్పకుండా కప్పాలన్నారు.