నేడు తునిలో రక్తదాన శిబిరం ఏర్పాటు

నేడు తునిలో రక్తదాన శిబిరం ఏర్పాటు

KKD: తలసీమియాతో బాధపడుతున్న పిల్లల కోసం గురువారం ఉదయం 10 గంటలు తుని పట్టణంలోని రెడ్ కాన్వెంట్ వీధిలోని రోటరీహాల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ మంగరాజు తెలిపారు. రోటరాక్ట్, ఇన్నర్పీల్ క్లబ్బులతోపాటు మమతా అసుపత్రి, మదర్ బ్లడ్ బ్యాంకు ద్వారా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.