ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలపాలి: మంత్రి సీతక్క
WGL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా అధికారులు ఉండాలన్నారు.