భూ సర్వేలో లోపాలు.. రైతులు ఆందోళన

భూ సర్వేలో లోపాలు.. రైతులు ఆందోళన

KRNL: గోనెగండ్లలో ప్రభుత్వ భూ సర్వే కొలతల్లో తేడాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రఘువీరుకు వినతిపత్రం ఇచ్చారు. సర్వే లోపాలను సరిదిద్ది సాగుదారులకు న్యాయం చేయాలన్నారు. ఏఐటీయూసీ కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ.. రైతులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.