ఆదోనిలో నీట మునిగిన రైతు బజార్

ఆదోనిలో నీట మునిగిన రైతు బజార్

KRNL: ఆదోనిలో మంగళవారం ఉదయం కురిసిన వర్షంతో రైతు బజార్ జలమయం అయింది. మోకాళ్లలోతు నీరు చేరడంతో రైతులు కూరగాయలు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలా వరద వచ్చి చేరుతోందని దీనిపై అధికారులు స్పందించకపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.