VIDEO: 'జూలైలోగా సాగునీరు అందించాలి'
హనుమకొండలోని చింతగట్టు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిల్పూరు, వేలేరు మండలాలకు 2026 జూలైలోగా సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. రైతుల సూచనలు స్వీకరించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మండలలలోని గ్రామల సర్పంచులు పాల్గొన్నారు.