'పరీక్షల వేళ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి'
MHBD: పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. బుధవారం ఆయన జడ్పీ సీఈవో పురుషోత్తంతో కలిసి గుమ్ముడూరు ఎంజేపీ పాఠశాల, కంకర బోర్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు.