తేనెటీగల దాడి.. ముగ్గరి పరిస్థితి విషమం

తేనెటీగల దాడి.. ముగ్గరి పరిస్థితి విషమం

ASR: అల్లూరి జిల్లా పాడేరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం అటవీశాఖ రేంజి కార్యాలయం ఎదురుగా రహదారిపై రాకపోకలు చేస్తున్న 20మంది వాహనదారులు, పాదచారులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన నెలకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ బాలింత, మరో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పందుతున్నారు. తేనెటీగలు దాడి చేసిన ప్రాంతంలో రాకపోకలు నిలివేశారు.