సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవాలు వద్దు: మంత్రి

సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవాలు వద్దు: మంత్రి

NGKL: సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో వేలంపాటలు, బలవంతపు ఏకగ్రీవాలు వద్దని మంత్రి జూపల్లికృష్ణారావు సూచించారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, ప్రజల చైతన్యం స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. బలవంతపు వేలం పాటల ద్వారా పదవులు దక్కించుకున్నవారు ప్రజల కష్టాల్లో భాగస్వాములు కాలేరని మంత్రి స్పష్టంచేశారు.