నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి
NRPT: జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గ నిరుద్యోగ యువతకు 8 రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 26లోపు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.