తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

తిరుమలలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం తెరమీదకు వచ్చాయి. తిరుమల శిలాతోరణం వద్ద ఓ భక్తుడు యథేచ్ఛగా డ్రోన్ ఎగరవేశాడు. అలిపిరి టోల్‌గేట్ మీదుగా ఈ డ్రోన్ కెమెరా వచ్చినా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. కాగా భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉంది.