అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలి: కలెక్టర్

VZM: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పురపాలిక, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లో ఉండాలన్నారు.