గురువుల వల్లే ఈ స్థాయికి: గుత్తా
NLG: గురువు చూపిన దారిలో నడవగలిగితే మన జీవితం విజయవంతం అవుతుందని శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎందరికో మార్గదర్శకులుగా నిలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డిని గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్లలో శుక్రవారం ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుధుడు ఆధ్వర్యంలో సన్మానించారు.