‘పర్యాటకం ఆదాయం కాదు.. వారసత్వం’
TG: పర్యాటకం కేవలం ఆదాయ వనరే కాదు, మన వారసత్వాన్ని, ప్రాచీన సంస్కృతిని ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని, స్థానిక కళాకారులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల సంరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కీలకం అని వివరించారు.