VIDEO: కలుషిత నీరు.. జనం బేజారు..!
వనపర్తి 14వ వార్డులో పైపులైన్ మరమ్మతుల కోసం తవ్విన గుంతను వారం రోజులుగా వదిలేయడంతో మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో మంచినీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి గుంతను పూడ్చి, శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.