నేడు జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు
ప్రకాశం: ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో ఇవాళ 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.