'నష్టపోయిన కౌలుదారులను ఆదుకోవాలి'

కృష్ణా: అధిక వర్షాల వల్ల నష్టపోయిన ఆలయ భూముల కౌలుదారులను ఆదుకోవాలని రైతు సంఘం సీనియర్ నాయకులు మురళీకృష్ణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన ముదినేపల్లిలో సోమవారం ఎమ్మార్వో సుభానిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ ఏడాది కౌలు కార్డులు రెన్యువల్ చేయకపోవడంతో రుణాలు సైతం బ్యాంకర్ల అందించలేదన్నారు. సమగ్ర విచారణ చేసి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కోరారు.