'మహిళల ఆరోగ్యంపై ప్రతి రోజూ ప్రత్యేక క్యాంపులు'

'మహిళల ఆరోగ్యంపై ప్రతి రోజూ ప్రత్యేక క్యాంపులు'

పెద్దపల్లి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సమావేశం నిర్వహించి, మహిళల ఆరోగ్యంపై అవగాహన కోసం ప్రతి రోజు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి స్వస్త్ నారీ, సశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు.