'రుషికొండ భవనాలపై ప్రముఖ హోటళ్లు ఆసక్తి'
AP: విశాఖ రుషికొండలోని భవనాలను ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇవాళ మంత్రులు DBV స్వామి, పయ్యావుల కేశవ్, అధికారులతో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ విషయమై చర్చించారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ.. త్వరలోనే CMకు GoM నివేదిక అదిస్తామని, ఈ భవనాలపై తాజ్, లీలా తదితర ప్రముఖ హోటళ్లు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.