'విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి'
KMR: విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని సహాయక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు మధుకర్, స్నిగ్ధ, శ్రవణ్ పేర్కొన్నారు. గాంధారి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో సోమవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.