డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి

డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి

కోనసీమ: రామచంద్రపురంలో డిజిటల్ సేవలు (మీసేవ/CSC) కేంద్రాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సాధికారికత లక్ష్యంగా ఈ డిజిటల్ సేవలను డీజీ-లక్ష్మి పేరుతో ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారికతకు మెప్మా ద్వారా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.