చెరువులోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం
అన్నమయ్య: ఆదివారం ఉదయం ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లింది. కర్నూలు నిర్మలానగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెరువు కట్టపై కారు అదుపు తప్పడంతో చెరువులో పడింది. అయితే, కంప్పచెట్లు అడ్డుపడటంతో కారు పూర్తిగా మునగకుండా బయటపడింది.