వడ్డేపల్లిలో నీటి సరఫరాకు అంతరాయం
GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద బూస్టర్ మోటార్ పైప్లైన్ లీక్ కారణంగా మరమ్మతులు చేపట్టారు. ఇవాళ రామాలయం ట్యాంకు పరిధిలోని వార్డులకు నీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఇంజినీర్ రాజశేఖర్ తెలిపారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేసి నీటి పంపిణీ పునరుద్ధరిస్తామని తెలిపారు.