VIDEO: లక్షెట్టిపేటలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
MNCL: లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుంచి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు.