హెచ్ఎంను సన్మానించిన జడ్పీ చైర్మన్

CTR: వీకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం పరుశురామ నాయుడు శుక్రవారం పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాలలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు శాలువాతో ఘనంగా సన్మానించారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని అభినందించారు..