హుజురాబాద్ డంపింగ్ యార్డుపై హామీ ఇచ్చిన మంత్రి పొన్నం
KNR: హుజురాబాద్(M) సిర్సపల్లి-రంగాపూర్ శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డును రద్దు చేయాలనే డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. శుక్రవారం ఇల్లంతకుంట శ్రీ సీతారాముల కళ్యాణానికి వెళ్తున్న మంత్రికి హుజురాబాద్ అఖిలపక్ష నాయకులు వినతి పత్రం అందించారు.