జిల్లాలో ఇసుక రీచ్‌ను అడ్డుకున్న రైతులు

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఇసుక రీచ్ వద్ద శనివారం ఇసుక తరలింపు ప్రయత్నాన్ని గ్రామ రైతులు అడ్డుకున్నారు. అనుమతులు లేని ట్రాక్టర్లను గమనించకుండా ఇష్టానుసార రీతిలో ఇసుకను తరలిస్తున్నారు. అంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం వల్ల మా బావులు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.