18 నుంచి ఎస్ఎఫ్ఐ శిక్షణ తరగతులు

18 నుంచి ఎస్ఎఫ్ఐ శిక్షణ తరగతులు

SRD: సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో ఎస్ఎఫ్ఐ విద్య వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాకేష్ తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం విద్యారంగంలో ఉన్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.