VIDEO: గ్యాస్ ధరల పెంపుపై మహిళా సంఘాల నిరసన
ATP: గుంతకల్లు ఆలూరు రోడ్డులోనీ సీఐటీయూ కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడంపై ఐద్వా మహిళా సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత అంటే ధరలు పెంచడం కాదన్నారు. ఈ నిర్ణయం సామాన్య గృహిణులపై మోయలేని భారమని విమర్శించారు.